పూరీ డైలాగులే కాదు.. సినిమా టైటిల్సూ హిట్టే..

పూరీ జగన్నాథ్.తెలుగులో మాస్ దర్శకుడు.

టాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన వ్యక్తి.

తను ఎంచుకునే కథే కాదు.

దానికి తగిని హీరోల ఎంపిక.వారితో పలికించే డైలాగులు అన్నీ మాస్ జనాలను మెప్పించేవే.

అద్భుతమైన పంచులతో దుమ్మురేపే హీరోయిజాన్ని చూపించడంలో పూరీ తనకు తానే సాటి అని చెప్పుకోవచ్చు.సినిమాలోని డైలాగులే కాదు.

Advertisement

సినిమాలకు పెట్టే పేర్లు కూడా జనాల్లోకి ఈజీగా దూసుకెళ్లేలా ఉండటం విశేషం.ఆ టైటిల్స్ కారణంగానే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పటి వరకు పూరీ తీసిన సినిమాలే కాదు.ఆయన టైటిల్సూ అదరగొట్టాయి.

విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా లైగ‌ర్.మొదట ఈ సినిమాకు ఫైటర్ అని పేరు పెట్టినా దాన్ని తర్వాత లైగర్ గా మార్చాడు.అటు బాలయ్యతో కలిసి చేసిన సినిమా పైసా వ‌సూల్.

మొదట తేడా సింగ్ అని ఈ సినిమాకు పేరు పెడదాం అనుకున్నా.చివరకు పేరును మార్చాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!

ఇస్మార్ట్ శంకర్.రోగ్.

Advertisement

ఇజం.లోఫర్.టెంపర్.

నేను నా రాక్షసి.నేనింతే.

బుజ్జిగాడు మేడిన్ చెన్నై.దేశముదురు.

పోకిరి.అమ్మానాన్న ఓ తమిళమ్మాయి.

ఇడియట్.బద్రి.

లాంటి టైటిల్స్ పెట్టి ఆకట్టుకున్నాడు.

సినిమా పేర్లే కాదు.ఆయా సినిమాలకు తగ్గట్లు హీరోల ఎంపిక కూడా అద్భుతంగా ఉంటుంది.మాస్ హీరోలను క్లాస్ గా చూపించడంలోనూ.

క్లాస్ హీరోలను మాస్ గా చూపించడంలోనూ పూరీ సక్సెస్ అయ్యాడు.క్లాస్ అబ్బాయిలా కనిపించే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అంతకు ముందెన్నడూ చూడని రీతిలో చూపించాడు.

తన గెటప్.తన మాటలు గతంతో పోల్చితే పూర్తిగా మారిపోయాయి.

జనాలు సైతం రామ్ ను ఈ సినిమాలో బాగానే రిసీవ్ చేసుకున్నారు.చాలా మంది క్లాస్ హీరో మాస్ గా మారితే ఎలా ఉంటుందో అనుకున్నారు.

కానీ ఆ అనుమానాలకు పటాపంచలు చేసి హిట్ కొట్టాడు.

తాజా వార్తలు