నా జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చావు.. మదర్స్ డే ఉపాసన స్పెషల్ పోస్ట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan) ఉపాసన(Upasana) ల వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది అయితే వీరికి పెళ్లి అయిన 11 సంవత్సరాలకు తల్లితండ్రులుగా మారారు.

గత ఏడాది జూన్ నెలలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా(Klin Kaara) అని నామకరణం చేశారు.ఇక ఈ చిన్నారికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

ఇలా క్లిన్ కారాకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆ చిన్నారి ఫేస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.కానీ ఇటీవల తిరుపతికి వెళ్లిన సమయంలో చిన్నారి ఫేస్ కాస్త రివీల్ కావడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.అయితే ఇటీవల మదర్స్ డే (Mothers day) సందర్భంగా ఉపాసన తన కుమార్తె అలాగే తన తల్లితో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.

ఇలా ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఉపాసన నా మొదటి మాతృ దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా మార్చినటువంటి క్లిన్ కారాకి ధన్యవాదాలు అంటూ ఈమె తెలియజేశారు.అలాగే తన చెల్లెలకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తన ఇద్దరి పిల్లలను కూడా తాను మిస్ అవుతున్నానంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఈ ఫోటోలలో ఉపాసన తన కుమార్తెను వెనుక నుంచి పూర్తిగా చూపించేసిన తన ఫేస్ మాత్రం క్లియర్ గా కనిపించకుండా కవర్ చేశారు.

Advertisement

ఇక ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పలువురు ఉపాసనకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...
Advertisement

తాజా వార్తలు