వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

కొందరు మనుషులకు జంతువులంటే ఎంతో ప్రేమ ఉంటుంది.ప్రేమను వారు వివిధ విధాలుగా వెల్లడిస్తుంటారు.

 Woman Giving Roti To Street Cows Viral Video, Viral News, Cows, Rotis, Stray-TeluguStop.com

కొందరు పెంపుడు జంతువులను పెంచుకుంటారు, మరికొందరు వాటి కోసం తాత్కాలిక షెల్టర్లు కట్టిస్తారు, కొందరు వీధుల్లో తిరిగే జంతువులకు ఆహారం పెడుతుంటారు.ఇలాంటి దృశ్యాలను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.

ముచ్చటగా అనిపిస్తుంది.ఇటీవలే, ఒక మహిళ, జంతువుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించే హార్ట్ టచ్చింగ్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో, రోడ్డుపక్కన రొట్టెలు తయారు చేస్తూ చిన్న హోటల్ బిజినెస్( Hotel business ) చేస్తున్న ఒక మహిళను చూడవచ్చు.ఆమె తన బండి దగ్గరకు వచ్చిన రెండు ఆవులకు ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.ఆ ఆవులు చాలా రోజులుగా పస్తున్నట్లుగా ఉన్నాయి.తిండి కోసం భిక్ష అడుగుతున్నట్లు ఉంటాయి.ఆ మహిళ ఏ మాత్రం ఆలోచించకుండా, చపాతీని ఒక ఆవుకు ఇస్తుంది.దాన్ని తినిన తర్వాత, ఆ ఆవు ముందుకు వెళ్లి, ఓపిగ్గా తన రొట్టె( Roti ) కోసం ఎదురుచూస్తున్న రెండో ఆవుకు స్పేస్ ఇస్తుంది.

ఆ తర్వాత ఆమె రెండో ఆవుకు కూడా రొట్టె అందజేస్తుంది.

వీడియోలో ఆమె ముఖం చూపించలేదు కాబట్టి, ఆమె ఎవరో నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు.అలాగే, వీడియో ఎక్కడ, ఎప్పుడు తీసారో కూడా తెలియదు.ఈ వీడియో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత చాలా త్వరగా వైరల్ అయింది, చాలా మంది దృష్టిని ఆకర్షించింది, చాలా మంది నుంచి వీడియోపై పాజిటివ్ కామెంట్స్ చేశారు.

కొందరు ఆమె దాతృత్వాన్ని ప్రశంసించారు, మరికొందరు ఆమెకు ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు పంపారు.ఇంత మంచి మనసున్న మహిళను దేవుడు చల్లగా చూడాలని ఒకరు కామెంట్ చేశారు.ఈ వీడియో చాలా మందికి నచ్చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.ఆమె ఆవులకు ఆహారం ఇవ్వడం మానవులు-జంతువుల మధ్య ఉన్న ప్రేమను చూపిస్తుంది.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube