రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పండుగ వాతావరణం మొదలైంది.అన్నిచోట్ల ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఓట్లు వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో సెలబ్రిటీ లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్(Allu Arjun) ఎన్టీఆర్ (NTR)వంటి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక ఓటు వేసిన అనంతరం అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నంద్యాల(Nandyala ) టూర్ పై క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి(Shilpa Ravi) అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకు పార్టీలతో సంబంధం లేదు.నేను న్యూట్రల్ గా ఉంటాను ఎక్కడైతే నాకు నచ్చిన వాళ్ళు ఉంటారో వారికి నేను తప్పకుండా మద్దతు తెలుపుతానని తెలిపారు.
అది నా మామయ్య పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆయనకు నేను మద్దతు ఇస్తాను.అలాగే నా స్నేహితుడు రవి కావచ్చు, రేపు మా మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే బన్ని వాసు కావచ్చు అని తెలిపారు.
రవితో నా ఫ్రెండ్షిప్ 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది.తను రాజకీయాలలో పోటీ చేస్తే డైరెక్ట్ గా వచ్చి తనకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను.కానీ 2019వ సంవత్సరంలో నేను తనని సపోర్ట్ చేయలేకపోయాను అందుకే ఇచ్చిన మాటకు కట్టబడి నేను నా భార్య స్నేహారెడ్డి (Sneha Reddy) నంద్యాలకు వెళ్లి తనని సపోర్ట్ చేశాము.నేను పార్టీల పరంగా వెళ్లలేదు కేవలం నా స్నేహితుడి కోసమే వెళ్లానని తెలిపారు.
ఇక భవిష్యత్తులో మీరు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా నవ్వుతూ నాకు అలాంటి ఆలోచన లేదని సమాధానం ఇస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు.