పది రూపాయల మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ కోసం లక్ష రూపాల ఫోనునే ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు?

కోతులు( Monkeys ) అంటే అవి చేసే అల్లరి, వాటి ఆటలు, తెలివితేటలు చూసి మనం నవ్వుకోకుండా ఉండలేం.

మనం సాధారణంగా ఆలయాల దగ్గర, పర్యాటక ప్రదేశాల్లో కోతులను ఎక్కువగా చూస్తుంటాం.

అలాంటి చోట్ల వచ్చిన పర్యాటకుల నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడం, వాటిని వదలకుండా ఆటపట్టించడం కోతులకు అలవాటే.కొన్ని సందర్భాల్లో అవి విలువైన వస్తువులను కూడా ఎత్తుకుపోతూ తమ తెలివిని ప్రదర్శిస్తుంటాయి.

ఇటువంటి ఓ ఫన్నీ ఘటన ఇటీవల బృందావన్‌లో ( Brindavan ) జరిగింది.ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బృందావన్‌లో ఓ పర్యాటకుడు అనుకోకుండా ఓ అల్లరి కోతి బారిన పడ్డాడు.అతను అక్కడ ఫొటోలు తీసుకుంటూ ఉండగా.

Advertisement
Monkey Steals One Lakh Rupees Phone For Ten Rupees Mango Packet Video Viral Deta

ఒక్కసారిగా ఓ కోతి అతని సామ్‌సంగ్ ఎస్ 25 మొబైల్‌ను( Samsung S25 Mobile ) పట్టుకొని పారిపోయింది.హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో అతను ఆశ్చర్యానికి గురయ్యాడు.

కోతి ప్రశాంతంగా ఒక కట్టడం పైకి ఎక్కేసి, ఫోన్‌ను పట్టుకుని యజమానిని ఏడిపించింది.అతను ఎంతగా బతిమాలుకున్నా, అది ఫోన్‌ను ఇచ్చేలా కనిపించలేదు.

Monkey Steals One Lakh Rupees Phone For Ten Rupees Mango Packet Video Viral Deta

దానితో కోతి ఫోన్‌ను వదిలి వేయించేందుకు అక్కడున్న స్థానికులు ఓ సలహా ఇచ్చారు.కోతకి ఇష్టమైన ఏదైనా తినే పదార్థం ఇస్తే, అది ఫోన్‌ను వదిలేయొచ్చని సూచించారు.దానితో ఆ పర్యాటకుడు వారి మాట విని కోతి ముందుకు ఒక మ్యాంగో జ్యూస్ ప్యాకెట్( Mango Juice Packet ) విసిరాడు.

కోతి ఆ ప్యాకెట్‌ను క్యాచ్ అందుకున్న తర్వాత ఆ జ్యూస్ ప్యాకెట్‌ను ఆసక్తిగా చూసుకుంటూ, తన చేతిలో ఉన్న మొబైల్‌ను కింద పడేసింది.

Monkey Steals One Lakh Rupees Phone For Ten Rupees Mango Packet Video Viral Deta
బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు చిట్టి.. ఆ వారసుడి నుంచి ఆఫర్ దక్కిందా?
ఇన్నాళ్లకు దొరికేశాడు.. మన ఫోన్లో వినిపించే వాయిస్ ఇతనిదే!

కోతి చేతిలో నుంచి ఫోన్ బయటపడడంతో ఆ పర్యాటకుడు హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకున్నాడు.కోతికి చిన్న "జ్యూస్ ప్యాకెట్" ఇచ్చి, ఫోన్‌ను తిరిగి పొందడం ఓ ఆసక్తికరమైన సంఘటనగా మారింది.ఈ ఫన్నీ సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

నెటిజన్లు కోతి తెలివిని మెచ్చుకుంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు కోతి ఎప్పటికీ కోతే.

వాటి తెలివితేటలు మాములుగా లేవంటూ స్పందిస్తున్నారు.ఈ వీడియో మరోసారి కోతుల తెలివిని, ఆటపట్టించే తీరును, మానవులపై వాటి ప్రభావాన్ని చక్కగా చూపించింది.

అలాంటి కోతుల అల్లరిని చూస్తే నవ్వకుండా ఉండలేం కదా.

తాజా వార్తలు