అప్పు తీర్చలేదంటూ శవానికి అంత్యక్రియలు జరగనీయకుండా!

రాజేంద్ర ప్రసాద్ మెయిన్ క్యారెక్టర్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఆ నలుగురు.

ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ చనిపోయిన తరువాత జరిగిన సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

తన అప్పు తీర్చేవరకు తల కొరివి పెట్టకూడదు అంటూ కోట అడిగిన తీరు గుర్తుకు వచ్చిందా.నిజంగా ఇలాంటి ఘటనలు నిజజీవితంలో జరుగుతాయా అని అనుకుంటే పొరపాటే.

నిజంగా ఇంత దారుణమైన మనుషులు ఉన్నారు అన్న విషయం తాజాగా వెల్లడైంది.చిత్తూరు జిల్లాలో ఇలాంటి సాంఘిక దురాచారం వెలుగుచూసింది.

పుంగనూరులో మొండోలు సామజిక వర్గానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి అదే సామజిక వర్గానికి చెందిన వ్యక్తుల వద్ద అప్పు చేశాడు.దీనికి అతని భార్య తండ్రి వెంకటరమణ హామీ ఇచ్చాడని అప్పుల వాళ్లు చెబుతున్నారు.

Advertisement

అయితే అనారోగ్యంతో వెంకటరమణ రెండురోజుల కిందట చనిపోయాడు.దీనితో అల్లుడు శివకుమార్ తమ దగ్గర తీసుకున్న లక్షల రూపాయల అప్పు తీర్చకుండా వెంకటరమణ శవానికి అంత్యక్రియలు జరిపితే కుదరదంటూ అప్పులవాళ్లు పట్టుబట్టి కూర్చున్నారు.

"బాకీ తీర్చలేదు" అంటూ అతని మృతదేహానికి రెండు రోజులుగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటున్నారు అప్పుల వాళ్ళు.మృతుని భార్య పిల్లలు ఎంత ప్రాధేయ పడ్డా కూడా కనికరం చూపట్లేదు.

పైగా చనిపోయిన బాధితుణ్ని వెలివేస్తున్నట్టుగా చింతచెట్టుకి చెప్పును వేలాడదీసి దానిపైన మృతుని పేరు రాసి ఆటవిక న్యాయాన్ని అమలు చేయడం గమనార్హం.మరోపక్క వెంకటరమణను కడసారి చూసేందుకు వెళ్ళే బంధువులను కూడా అడ్డుకునేందుకు యత్నించారు.

చంద్రమండలంపై కాలనీలు నిర్మించేందుకు సిద్ధమవుతున్న ఈ కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పలువురిని ఆందోలనకు గురిచేస్తుంది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు