యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మోదీ అనుచ‌రుడు.. !

రాజ్యాన్ని పాలించే రాజు తలచుకుంటే క్షణాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయన్నది పచ్చి నిజం.ప్రస్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది.

కాగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, ఇతర మంత్రి వ‌ర్గం పై క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు వచ్చిన నేపధ్యంలో వీరిని మార్చాలనే ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.ఒకగానొక దశలో ఏకే శ‌ర్మ‌ను యూపీ మంత్రిగా చేయ‌వ‌చ్చ‌న్న టాక్ కూడా వినిపించింది.

Modi Follower Aravind Kumar Sharma As Up Bjp Vice President, PM Modi, UP BJP, V

ఈ క్రమంలో యూపీ జిల్లా మౌకు చెందిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అనుచ‌రుడు, మాజీ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ శ‌ర్మ‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ బీజేపీ ఉపాధ్య‌క్షుడిగా నియమించడం వెనక ఏదైనా ప్రణాళిక ఉందా అనే అనుమానాలకు తావిస్తుందట.ఎందుకంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఏకే శ‌ర్మ‌కు ఉపాధ్య‌క్షుడి పదవి కట్టబెట్టడంతో యూపీ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టినట్లే అని భావిస్తున్నారట.

3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు