పోలీస్ స్టేషన్ నిర్వాహనపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన! ఎస్సై రమాకాంత్..

రాజన్నసిరిసిల్ల జిల్లా :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశాలతో కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో మోడల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, రిసెప్షన్, స్టేషన్ రైటర్, వి హెచ్ ఎఫ్ సెట్, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, ఆయుధాలు భద్రపరచు రూమ్, 9ఎం ఎం పిస్టల్, ఇతర ఆయుధాల గురించి, టీఎస్ కాప్ అందులో ఉన్న ఫ్యూచర్స్ గురించి, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి మైనర్ డ్రైవింగ్ చేయవద్దని మోటార్ వాహనాల చట్టాలు వివిధ రకాల బందోబస్తు గురించి, పోగొట్టుకున్న ఫోన్ సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా దొరికే విధానం వివిధ రకాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి, కానిస్టేబుల్ లు సత్యం, ఇమ్రాన్, శ్రీధర్ సిబ్బంది, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉన్నారు.

అనారోగ్య బాధితులకు ఆర్దికంగా అండ తక్షణమే సహాయం అందించిన జిల్లా కలెక్టర్

Latest Rajanna Sircilla News