సినిమా ఛాన్స్ కోసమని వెళితే ఆ డైరెక్టర్ బట్టలు విప్పి...

సాధారణంగా ఈ కాలంలో సినిమా పరిశ్రమ అన్న తర్వాత క్యాస్టింగ్ కౌచ్ సమస్య కామన్ గా ఉన్నట్లు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు చెప్పకనే చెప్పారు.

అయితే ఇందులో కొందరు అవకాశాల కోసం సర్దుకు పోతుంటే మరికొందరు మాత్రం నిర్భయంగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి చెప్తున్నారు.

 దీనికి తోడు సోషల్ మీడియా మాధ్యమాలు మరియు మీడియా సపోర్ట్  భాదితులకు అందించడంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు.అయితే తాజాగా బాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ మోడల్ డింపుల్ పౌలా అనే మోడల్ తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.

Dimple Paula, Bollywood Actress, Model, Casting Couch Issue, Bollywood Film Indu

ఇందులో భాగంగా తాను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ సారి సినిమా అవకాశం విషయమై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ ని తన ఆఫీసులో కలిసేందుకు వెళ్లానని ఆ సమయంలో సాజిద్ ఖాన్ తనని అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడని తెలిపింది.అంతేకాకుండా తనని ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నిలబడాలని బలవంత పెట్టాడని  వాపోయింది.

దాంతో తాను విషయం అర్థం చేసుకొని అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని వెళ్లిపోయానని అప్పట్లో తనకి  ఈ విషయం గురించి బయట మాట్లాడడానికి ధైర్యం చాలడం లేదని కానీ ప్రస్తుతం ఈ మీటూ ఉద్యమం గురించి అవగాహన పెరగడంతో ధైర్యంగా ముందుకు వచ్చానని తెలిపింది.  ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా దర్శకుడు సాజిద్ ఖాన్ పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

Advertisement

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ దర్శకుడిగా మంచి చిత్రాలను చిత్రీకరించి వాటి ద్వారా మంచిని ప్రజలకు పంచాల్సింది పోయి బాధ్యత గల దర్శకుడు నటీనటుల పై ఇలా లైంగిక వేధింపులకు పాల్పడడం సరికాదని అంటున్నారు. అంతేగాక సినీ పరిశ్రమలో ఇలాంటి కొంతమంది వల్ల మొత్తం సినిమా పరిశ్రమకి చెడ్డ పేరు వస్తుందని కాబట్టి దర్శకుడు సాజిద్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ అసోసియేషన్ ఛాంబర్ సభ్యులని కోరుతున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు