అభ్యర్థులకు దసరా 'సరదా' తీరిపోతోంది

ఎన్నికల ప్రచారం అంటేనే భారీ ఖర్చుతో కూడుకుని ఉంటుంది.చిన్నదానికి పెద్దదానికి భారీగా చేతి చమురు వదిలించుకోవాల్సిందే.

 Mla Candidates Are Buyying Sheeps For Coming Dasara-TeluguStop.com

ఎక్కడా ప్రత్యర్థులకు తగ్గకుండా పై చేయి సాధించాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే.ఇక పండగల సీజన్ అయితే చెప్పక్కర్లేదు.

ఇప్పడు తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్థులకు కూడా అలంటి చిక్కే వచ్చి పడింది.

దసరా అంటే తెలంగాణ పల్లెల్లో పెద్ద పండుగ.మాంసం, మందు లేనిదే ఇంట్లో పండగ జరగదు.దీంతో ఇప్పుడు దసరాకి నేతలను కొత్త కొత్త కోర్కెలు కోరుతున్నారు కార్యకర్తలు.

మా ఊళ్లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా 500 మంది ఉన్నామని ఒకరు.మా ఊళ్లో మా కులానికి చెందిన వారు మొత్తం 400 మందిమి ఉన్నాం.

మాకు నాలుగు నుంచి ఐదు గొర్రెలు ఇస్తే సరిపెట్టుకుంటాం.మందు ఇస్తే మరీ మంచిది అంటూ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.

పండగ మీ పేరు మీద చేస్తే ఓట్లు గ్యారంటీ.ఎందుకంటే పండగ రోజు తిన్న వారు ఏవరూ మరిచిపోయారు.పక్కాగా ఓటేస్తారు అంటూ… పండుగ మేం మీ పేరు చెప్పి చేసుకుంటాం అంటూ నాయకులను మొహమాటం పెట్టేస్తున్నారు.ఇలాంటి అనుభవమే ఎదురైన ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బడా ఎమ్మెల్యే.

మహారాష్ట్ర నుంచి నాలుగు లారీల మేకలను ఆర్డర్ చేశాడట.దసరా పండుగకు గ్రామాల్లో పంచిపెట్టేందుకు… ఓట్లు రాబట్టుకునేందుకు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube