కేసీఆర్ వర్సెస్ గవర్నర్ ! ఎవరూ తగ్గట్లే ?

తెలంగాణ సీఎం కేసీఆర్,  గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మధ్య గత కొంతకాలంగా ప్రోటోకాల్ వివాదం నడుస్తూనే ఉంది.ప్రోటోకాల్ ప్రకారం కొన్ని కొన్ని కార్యక్రమాలకు గవర్నర్ ఆహ్వానం మేరకు కేసిఆర్ హాజరుకావల్సి ఉన్నా.

 Kcr Vs Governor  No One Down ,telangana Governor, Tamilsai Soundara Rajan, Telan-TeluguStop.com

ఆయన హాజరు కాకపోవడం , అలాగే గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని గవర్నర్ ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడం వంటి వ్యవహారాలతో చాలాకాలంగా ఈ వివాదం పై చర్చ జరుగుతోంది.గవర్నర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని గవర్నర్ పై నేరుగా సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లడం సంచలన రేపింది.

Telugu Secretary, Suprem, Telangana Cs, Telangana-Politics

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదం బడ్జెట్ సమావేశాలు సందర్భంగా సర్దుమనుగుతుంది అని అంతా భావించినా,  ఇప్పుడు గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో గవర్నర్,  ప్రభుత్వం మధ్య ఇంకా వివాదం నడుస్తూనే ఉందనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది.ఈ వ్యవహారంపై స్పందించిన గవర్నర్ ఢిల్లీకి వెళ్లే బదులు,  రాజ్ భవన్ కు రావాల్సిందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం వంటివి జరిగాయి.సి.ఎస్ అసలు గౌరవించడం లేదని గవర్నర్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఈ స్థాయిలో వివాదం ఎందుకు ఏర్పడింది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.అటు కెసిఆర్ ఇటు గవర్నర్ ఎవరికి వారు తమే పై చేయి సాధించాలని చూస్తూ ఉండడంతో,  ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

Telugu Secretary, Suprem, Telangana Cs, Telangana-Politics

బడ్జెట్ సమావేశాలు సమయంలో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు మధ్య సఖ్యత కుదిరినా,  తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు కల్పించాల్సిన ప్రోటోకాల్ కల్పించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.చీఫ్ సెక్రటరీ మర్యాదపూర్వకంగా కూడా కలవడం లేదని తనకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ ఆగ్రహంగా ఉన్నారు.ఈ విధంగా ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య ఏదో ఒక అంశంలో వివాదం ఏర్పడుతూనే ఉండడంతో,  ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube