వింట‌ర్‌లో పాదాల‌ను ర‌క్షించే `పుదీనా`.. ఎలాగంటే?

ప్ర‌స్తుత ఈ వింట‌ర్ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ప్ర‌ధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో పాదాలు ప‌గుళ్ల స‌మ‌స్య ముందు వ‌ర‌స‌లో ఉంటుద‌ని అన‌డంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.

ఈ క్ర‌మంలోనే పాదాల ప‌గుళ్ల‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీముల‌ను వాడుతుంటారు.

ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే ప‌గుళ్ల‌ను త‌గ్గించి పాదాల‌ను ర‌క్షించ‌డంలో పుదీనా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, పుదీనా ఆకుల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌క విలువ‌లు పాదాల ప‌గుళ్ల నుంచి విముక్తిని క‌లిగించ‌గ‌ల‌వు.మ‌రి ఇంత‌కీ పుదీనాను పాదాల‌కు ఎలా యూజ్ చేయాలో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక క‌ప్పు పుదీనా ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు బౌల్‌లో రెండు స్పూన్ల పుదీనా పేస్ట్‌, ఒక స్పూన్ పెట్రోలియం జెల్లీ, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె మ‌రియు అర స్పూన్ ప‌చ్చి పాలు వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

Advertisement
Mint Leaves Help To Get Rid Of Cracked Heels Naturally! Mint Leaves, Cracked Hee

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ప‌గుళ్ల‌పై అప్లై చేసి ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రంగా చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే చాలా త్వ‌ర‌గా ప‌గుళ్లు త‌గ్గి పాదాలు మృదువుగా, అందంగా మార‌తాయి.అలాగే పుదీనాను ఉప‌యోగించి మ‌రో విధంగా కూడా పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

అదెలాగంటే.ఒక గిన్నెలో గ్లాస్ వాట‌ర్ పోసి అందులో గుప్పెడు పుదీనా ఆకుల‌ను వేయండి.

ఇప్పుడు నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి.చ‌ల్లార‌క వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇప్పుడు బౌల్‌లో రెండు స్పూన్ల పుదీనా వాట‌ర్‌, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

Mint Leaves Help To Get Rid Of Cracked Heels Naturally Mint Leaves, Cracked Hee
Advertisement

ఆ త‌ర్వాత మిశ్ర‌మాన్ని ప‌గుళ్ల‌పై పూసి.అర గంట పాటు వ‌దిలేయండి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రంగా వాష్ చేసుకోండి.

ఇలా చేసినా కూడా పాదాల ప‌గుళ్ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు