బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఘనంగా బోనాల ఉత్సవాల నిర్వహణ జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం మహంకాళి ఆలయం వద్ద మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు.

లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు.ఉమ్మడి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు అరకొర ఏర్పాట్లు జరిగేవన్నారు.

ప్రైవేట్ దేవాలయాలకు 15 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో ప్రైవేట్ ఆలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం ఇవ్వడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement
ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధికి నటుడు రావు రమేష్ భారీ విరాళం..!!

Latest Hyderabad News