టీడీపీ నేతలపై మంత్రి రోజా ఫైర్

టీడీపీ నేతలపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ నాయకులకు పిచ్చి పరాకాష్టకు చేరి చార్జిషీట్ అంటున్నారని మండిపడ్డారు.

600 హామీలు ఇస్తే ఆరు హామీలు కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబని మంత్రి రోజా తెలిపారు.సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబని పేర్కొన్నారు.

ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అని మండిపడ్డారు.అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి అదే పథకాన్ని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు.20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.చంద్రబాబును నమ్మి ఓటేసే రైతులు ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు