ఈ నెల 14న కరీంనగర్ లో మంత్రి పొన్నం దీక్ష..!!

కరీంనగర్ లో ఈ నెల 14వ తేదీన మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) దీక్ష చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా బీజేపీ అన్యాయం చేసిందంటూ పొన్నం దీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇచ్చిన వారినే బీఆర్ఎస్( BRS ) ఓట్లు అడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ క్రమంలోనే ఒక్క వేలు తమపై చూపెడితే నాలుగు వేళ్లు మీ వైపు చూపిస్తామని చెప్పారు.

మిషన్ కాకతీయ నీళ్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.తెలంగాణ ఏర్పాటుపై మోదీ( Narendra Modi ) అవహేళనగా మాట్లాడారన్న పొన్నం తెలంగాణ అమరులను సైతం మోదీ అవమానించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు మోదీకి ఎక్కడిదని నిలదీశారు.రాష్ట్రానికి బీజేపీ( BJP ) చేసిందేంటన్న మంత్రి పొన్నం రాముడి ఫొటో పక్కన మోదీ ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు.

Advertisement

రాజకీయాల కోసం రాముడిని వాడుకోవడం తప్పని వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు