ట్యాంక్ బండ్ పై మంత్రి మాటా-మంతి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేటకు మణిహారంగా ఉన్న సద్దుల చెరువు ట్యాంక్ బండ్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.

ట్యాంక్ బండ్ పై కలియతిరుగుతూ పాదచారులకు,విజిటర్స్ కు కావాల్సిన సదుపాయాలపై మంత్రి ఆడిగి తెలుసుకున్నారు.

తమకు సౌకర్యవంతంగా,ఆహ్లాదకరంగా ఉండేలా సద్దుల చెరువును ట్యాంక్ బండ్ లా తీర్చిదిద్దిన మంత్రికి పాదచారులు,యువకులు కృతజ్ఞతలు తెలిపారు.ట్యాంక్ బండ్ పై కూర్చోవడానికి వీలుగా సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా,దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

త్వరలోనే ట్యాంక్ బండ్ పై అధునాతన సీటింగ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.గంటకి పైగా ట్యాంక్ బండ్ పై కలియతిరిగిన మంత్రి యువకులు,చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

అనంతరం లోయర్ సద్దుల చెరువు ట్యాంక్ బండ్ క్రింద సాగుతున్న కాలువ పనులను పరిశీలించి,త్వరగా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మంత్రి వెంట జడ్పిటిసి జీడీ భిక్షం,తదితరులు ఉన్నారు.

Advertisement
అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?

Latest Suryapet News