జొన్న పంటకు తీవ్ర నష్టం కలిగించే మిడ్జ్ కీటకాలను అరికట్టే పద్ధతులు..!

జొన్న పంటను( Sorghum crop ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే మిడ్జ్ కీటకాలు( Midge insects ) దోమలాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి.

వాతావరణం లో ఉష్ణోగ్రత పెరిగిన తేమ పెరిగిన ఇవి ధాన్యంలో నుంచి బయటకు వచ్చి సంభోగంలో పాల్గొంటాయి.

కొంతకాలం తర్వాత గుడ్లు పెడతాయి.వీటి నుంచి రంగులేని లార్వా వృద్ధి చెంది ధాన్యం యొక్క మృదు కణజాలాన్ని తినడం ప్రారంభిస్తుంది.

ధాన్యంలో ఉన్న లార్వా నిద్రావస్థలోకి ప్రవేశించి దాదాపుగా మూడు సంవత్సరాల వరకు విశ్రాంతి తీసుకుంటాయి.ఈ కీటకాలు జొన్న పంటను ఆశించడం వల్ల జొన్న విత్తనాలు ముడతలు పడి, వికృతంగా, ఖాళీగా, పొట్టు లాగా మారుతాయి.

పరిపక్వత చెందిన పంటలో, జొన్న కంకులు ఎండిపోయిన లేదా పేలిన రూపాన్ని కలిగి ఉంటాయి.ఈ కీటకాలు ఆశించిన కంకి లో గింజలు మొత్తం ఖాళీ అయిపోతాయి.

Advertisement

జొన్న పంట పొలం చుట్టుపక్కల అడవి జొన్న లేదా జాన్సన్ గడ్డి ( Johnson grass )లేదా సుడాన్ గడ్డి( Sudan grass ) లాంటి అతిధి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి.పొలంలోనే కాదు పొలం చుట్టూ కూడా పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి.ఈ కీటకాల బెడద వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కీటకాలు ఆశించిన మొక్కలను వెంటనే తొలగించాలి.

మొక్కజొన్న పంట కోతల తరువాత పత్తి లేదా పొద్దు తిరుగుడు పంటలతో పంట మార్పిడి చేయాలి.సోయాబీన్స్, అలసంద, కుసుమ లాంటి పంటలను జొన్నలో అంతర పంటలుగా వేయాలి.

ఈ మిడ్జ్ కీటకాలను జొన్న పొలంలో గుర్తించిన తర్వాత ఉదయం సమయంలో పిచికారి మందులను ఉపయోగించాలి.క్లోరిపైరిఫోస్, సైథలోథ్రీన్, మలాథియాన్( Chlorpyrifos, Cythalothrene, Malathion ) లలో ఏదో ఒక మందును పిచికారి చేయాలి.ఈ కీటకాలు ఉదయం సమయంలో మాత్రమే బయటకి వస్తాయి కాబట్టి ఆ సమయంలో రసాయన మందులు పిచికారి చేయడం వల్ల వీటిని పూర్తిస్థాయిలో అరికట్టి జొన్న పంటను సంరక్షించుకోవచ్చు.

పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..
Advertisement

తాజా వార్తలు