ఫుడ్ వోచర్లను అందుకు వాడిన మెటా ఎంప్లాయిస్.. కట్ చేస్తే జాబ్‌ గోవిందా..?

ఫేస్‌బుక్ ( Facebook )మాతృ సంస్థ మెటాలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు అయితే కొంతమంది ఇలాంటి మంచి అదృష్టం దొరికిన మోసానికి పాల్పడి జాబ్ కోల్పోయారు.

కంపెనీ తాజాగా లాస్ ఏంజిల్స్‌లో( Los Angeles ) పనిచేసే 24 మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది.

ఈ ఉద్యోగులు కంపెనీ ఇచ్చే ఫుడ్ వోచర్లను తప్పుగా వాడినందుకే వారిని తొలగించారు.

కంపెనీ ప్రతి ఉద్యోగికి పని చేస్తున్న సమయంలో ఆహారం కొనుక్కోవడానికి రోజుకు 25 డాలర్లు ఇస్తుంది.కానీ ఈ ఉద్యోగులు ఆ డబ్బుతో ఆహారం కాకుండా, టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, స్కాచ్‌టేప్, వైన్ గ్లాసులు వంటి ఇతర వస్తువులు కొనుక్కొన్నారు.అందుకే కంపెనీ వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించింది.

అంతేకాకుండా, ఆఫీసులో లేనప్పుడు కూడా ఈ డబ్బును వృథా చేయకుండా ఉండాలని ఆహారం కొనుక్కొన్నారు.కొందరు లేడీ ఎంప్లాయిస్ ఈ విషయాన్ని ఒక రహస్య సామాజిక మాధ్యమ వేదికలో బహిరంగంగా చెప్పారు./br>

Advertisement

ఈ విషయం తెలుసుకున్న కంపెనీ, వెంటనే దీనిపై దర్యాప్తు చేసింది.దర్యాప్తులో ఈ ఉద్యోగులు నిబంధనలను ఉల్లంఘించారని తేలింది.దీంతో కంపెనీ వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించింది.

చిన్న చిన్న తప్పులు చేసిన వారికి మాత్రం హెచ్చరించి వదిలేశారు మళ్లీ రిపీట్ చేస్తే వారి జాబులు కూడా తీసేస్తామని వార్నింగ్ ఇచ్చారు.ఇకపోతే ఆదాయం పెంచుకోవాలని ఉద్దేశంతో మెటా కంపెనీ గత రెండేళ్లలో దాదాపు 21,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది.

కంపెనీ యజమాని మార్క్ జుకర్‌బర్గ్( Mark Zuckerberg ) కంపెనీ ఖర్చులు తగ్గించి, కొత్త విధానాలను తీసుకువస్తున్నారు.వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి కంపెనీ విభాగాలను కూడా రిస్ట్రక్చరింగ్ చేయాలని నిర్ణయించారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు