ఈరోజుల్లో రోడ్డు రేజ్ సంఘటనలు బాగా ఎక్కువైపోతున్నాయి.ఈ ఘటనలలో కొందరు విచక్షణ కోల్పోయి ఇతరులను చంపేస్తూ జైలు పాలవుతున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో ఓ దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది.ఒక వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా బైక్‌పై వస్తున్న ఒక వ్యక్తి అతనికి చాలా దగ్గరగా పోనిచ్చాడు.
ఈ బైక్‌పై ఆ వ్యక్తితో పాటు మరో మహిళ, ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నారు.దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది.
ఈ వీడియోలో రోడ్డు దాటుతున్న ఒక వృద్ధుడు అతివేగంగా బైక్ నడుపుతున్న ఒక బైక్ ని స్లోగా వెళ్ళమని సైగ చేయడం చూడవచ్చు.ఆ వృద్ధుడు అలా వారించినందుకు బైకర్‌కి కోపం వచ్చింది.అంతే అతడు తన బైక్ ను పక్కన ఆపి వృద్ధుడిపై దాడి చేశాడు.ఈ దాడిలో వృద్ధుడు తలకు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన సీసీటివి ఫుటేజ్ అక్టోబర్ 17న సోషల్ మీడియా( Social media)లో వైరల్‌గా మారింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్( Arrested ) చేశారు.
ఈ ఘటన మనందరికీ ఒక పాఠం.రోడ్డుపై వేగంగా వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.
అలాగే వాహనదారులతో అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు సంయమనం పాటిస్తేనే మంచిది లేకపోతే ఇలాంటి ఘటనలే పునరావృతమయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్( Hyderabad)లోనే కాదు భారతదేశంలో అనేక చోట్ల రోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అతివేగంగా వాహనాలు నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.అతివేగంతో వెళుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.