ఆ మ్యాజికల్ సీన్ ను వీరయ్య మళ్ళీ రిపీట్ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.ఆచార్య వంటి ప్లాప్ తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.ఇక ఇప్పుడు మరో సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో ఆకట్టు కోవడానికి రెడీ అవుతున్నాడు.

ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంతగా మెగాస్టార్ లుక్ పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి మారిపోయాడు.ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ లో మెగాస్టార్ పలు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తూ అలరించాడు.

Advertisement

మరి టీజర్ లో పక్కా మాస్ పాత్రలో కనిపించగా తాజాగా మరో సాలిడ్ లుక్ లో బయటకు వచ్చింది.మేకర్స్ నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పోస్టర్ లో మెగాస్టార్ చుట్టూ గన్స్ ఉండగా.చేతులకు సంకెళ్లు ఉన్నాయి.

ఈ క్రేజీ పోస్టర్ చుసిన వారికీ మరో క్రేజీ సినిమా గుర్తుకు వస్తుంది.

ఈ సెటప్ అంతా చూసి ఒక పోలీస్ స్టేషన్ లా అనిపించగా.ఇప్పుడు మెగాస్టార్ సినిమాల్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమా అయినా ఖైదీ సినిమా గుర్తుకు వస్తుంది.ఖైదీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ను తలపించేలా వాల్తేరు వీరయ్య లో ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

అలాగే ఆ మాజికల్ సీన్ మళ్ళీ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తికర సంభాషణ సాగుతుంది.చూడాలి ఈ సినిమా ఎలా అలరిస్తుందో.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.2023 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

Advertisement

తాజా వార్తలు