Mega Heroes Movies : ఒకే తరహా కథలలో నటించిన మెగా హీరోలు వీళ్లే.. ఆ సినిమాల రిజల్ట్ ఏంటంటే?

ఒకే తరహా కథలలో నటించి విజయం సాధించడం సులువు కాదు.

అయితే మెగా హీరోలలో( Mega Heroes ) కొంతమంది హీరోలు మాత్రం ఒకే తరహా కథలలో నటించి విజయం సాధించారు.

కథ పూర్తిగా సేమ్ కాకపోయినా రెండు సినిమాల మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.2013 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదలైంది.అయితే రామ్ చరణ్( Ram Charan ) నటించిన గోవిందుడు అందరివాడేలే( Govindudu Andarivadele ) సినిమా కథ సిమిలర్ గా ఉంటుంది.

గోవిందుడు అందరివాడేలే మూవీ కూడా హిట్ కాగా ఈ సినిమా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.అత్తారింటికి దారేదిలో అత్త కోసం హీరో వెళితే గోవిందుడు అందరివాడేలే సినిమాలో తాత కుటుంబానికి, తండ్రి కుటుంబానికి మధ్య ఉన్న గ్యాప్ కు చెక్ పెట్టే పాత్రలో రామ్ చరణ్ నటించారు.

ఇదే విధంగా అల్లు అర్జున్ బన్నీ,( Bunny ) చరణ్ రచ్చ ( Racha ) సినిమాల విషయంలో కూడా జరిగింది.ఈ రెండు సినిమాల కథలు దాదాపుగా సిమిలర్ గా ఉంటాయి.బన్నీ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో బిజీగా ఉన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇందుకు సంబంధించిన మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు