Mega Heroes Movies : ఒకే తరహా కథలలో నటించిన మెగా హీరోలు వీళ్లే.. ఆ సినిమాల రిజల్ట్ ఏంటంటే?

ఒకే తరహా కథలలో నటించి విజయం సాధించడం సులువు కాదు.అయితే మెగా హీరోలలో( Mega Heroes ) కొంతమంది హీరోలు మాత్రం ఒకే తరహా కథలలో నటించి విజయం సాధించారు.

కథ పూర్తిగా సేమ్ కాకపోయినా రెండు సినిమాల మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

2013 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదలైంది.అయితే రామ్ చరణ్( Ram Charan ) నటించిన గోవిందుడు అందరివాడేలే( Govindudu Andarivadele ) సినిమా కథ సిమిలర్ గా ఉంటుంది.

గోవిందుడు అందరివాడేలే మూవీ కూడా హిట్ కాగా ఈ సినిమా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.

అత్తారింటికి దారేదిలో అత్త కోసం హీరో వెళితే గోవిందుడు అందరివాడేలే సినిమాలో తాత కుటుంబానికి, తండ్రి కుటుంబానికి మధ్య ఉన్న గ్యాప్ కు చెక్ పెట్టే పాత్రలో రామ్ చరణ్ నటించారు.

"""/" / ఇదే విధంగా అల్లు అర్జున్ బన్నీ,( Bunny ) చరణ్ రచ్చ ( Racha ) సినిమాల విషయంలో కూడా జరిగింది.

ఈ రెండు సినిమాల కథలు దాదాపుగా సిమిలర్ గా ఉంటాయి.బన్నీ సినిమాకు వి.

వి.వినాయక్ దర్శకత్వం వహించగా రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు.

ఈ రెండు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. """/" / రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో బిజీగా ఉన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఇందుకు సంబంధించిన మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌ గెలిస్తే .. ఎలాన్ మస్క్ ఆయనకు సలహాదారుడు కానున్నారా .?