నాగబాబు మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. మరి సఫలం అయ్యేనా?

మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినంత నాగబాబు సక్సెస్ కాలేక పోయాడు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు.కానీ నాగబాబు మాత్రం సక్సెస్ కాలేక పోయాడు.

ఈయన చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ బుల్లితెరపై కనిపిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నాడు.ఇప్పటికి ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు వచ్చిన పాత్రలను చేసుకుంటు పోతున్నాడు.

అయితే ఈయన మళ్ళీ నిర్మాణం పై ద్రుష్టి పెట్టాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.నాగబాబు ఇంతకు ముందు కూడా నిర్మాతగా చేసాడు.

Advertisement
Mega Brother Nagababu Is Another Risky , Mega Brother , Nagababu , Varun Tej , C

అయితే అప్పుడు ఈయన చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు.ముఖ్యంగా నాగబాబు ఆరెంజ్ సినిమాకు నిర్మాతగా చేసి కోలుకొని దెబ్బ తిన్నాడు.

ఆ సమయంలో నాగబాబు కు అండగా ఒక్క పవన్ మాత్రమే నిలిచాడు.ఆరెంజ్ ఆ రేంజ్ లో ప్లాప్ అయినా తర్వాత నాగబాబు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

అప్పటి నుండి ఈయన మళ్ళీ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వలేదు.ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ నాగబాబు నా పేరు సూర్య సినిమాతో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.

ఆ సినిమా నిర్మాణంలో చిన్న షేర్ తీసుకున్నాడు.అయితే ఈ సినిమా కూడా సేమ్ ఫలితం ఇచ్చింది.

Mega Brother Nagababu Is Another Risky , Mega Brother , Nagababu , Varun Tej , C
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇక మళ్ళీ ఈయన ఆపేసాడు.ఇక ఇప్పుడు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.ఎంత చేస్తున్న ఈయనకు నిర్మాతగా మారాలన్న కోరిక మాత్రం పోవడం లేదు.

Advertisement

అందుకే మళ్ళీ నిర్మాణం వైపే ఈయన అడుగులు పడుతున్నాయి.నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేసున్నాడు.

కాబట్టి ఈయన తనయుడు సినిమాతోనే నిర్మాతగా మారాలని అనుకుంటున్నాడట.

ఈ విషయన్ని వరుణ్ స్వయంగా చెప్పారు.ఈయన నటించిన ఎఫ్ 3 ఈ రోజు రిలీజ్ అయ్యింది.ఆ తర్వాత వరుణ్ ప్రవీణ్ సత్తార్ సినిమా స్టార్ట్ కానుంది.

ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి నాగబాబు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించ బోతున్నాడని కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా ఉండబోతుంది అని వరుణ్ తెలిపారు.దీంతో నాగబాబు మరోసారి రిస్క్ చేస్తున్నాడు.

మరి ఈసారి అయినా కొడుకు ద్వారా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు