Ravi Teja : తమిళ్ రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ.. తెలుగు సినిమాలు చెయ్యడం కష్టమే?

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ హీరోలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

దానికి తోడు బాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో టాలీవుడ్ హీరోల పేర్లు బాలీవుడ్ లో టాలీవుడ్ లో మారుమోగిపోతున్నాయి.

ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ను ఏలుతున్నాయి.దాంతో బాలీవుడ్ లో కూడా టాలీవుడ్ హీరోలకు క్రేజ్ పెరిగిపోవడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనపడుతున్నారు.

ఇప్పటికి టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే హిందీలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.హీరోలుగా కాకపోయినా కనీసం బాలీవుడ్ సినిమాలలో గెస్ట్ రోల్ లో నటించమని కోరుతున్నారు బాలీవుడ్ నిర్మాతలు.

ఇక ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున నటించిన విషయం తెలిసిందే.అలాగే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య నటించారు.

Advertisement
Mass Maharaja Ravi Teja Bollywood Entry-Ravi Teja : తమిళ్ రీమ�

సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటిస్తున్న కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Mass Maharaja Ravi Teja Bollywood Entry

ఇందులో మెగా పవర్ స్టార్ చరణ్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో ఓ సాంగ్ లో స్టెప్పులేయబోతున్నాడు.ఇప్పటికీ సల్మాన్ ఖాన్, వెంకటేష్,రామ్ చరణ్ ముగ్గురు కలిసి చేసిన ఒక మాస్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో హిట్లు కొడుతూ.తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ( Ravi teja )హీరో రవితేజతో హిందీ మేకర్స్ ఒక రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్( Varun Dhawan ) నటించబోతున్నట్టు తెలుస్తోంది.అది కూడా సౌత్ రీమేక్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారట.

Mass Maharaja Ravi Teja Bollywood Entry
ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

తమిళంలో కలెక్షన్ ల సునామిని సృష్టించిన మానాడు సినిమాను( Maanaadu ) బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా తమిళంలో శింబు నటించిన పాత్రలో వరుణ్‌ చేయగా, ఎస్‌.జే సూర్య చేసిన పాత్రలో రవితేజ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను రానా, ఏషియన్‌ సునీల్‌తో కలిసి కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నాడట.ఒకవేళ ఇదే వార్త కనుక నిజమైతే మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని చెప్పవచ్చు.

తాజా వార్తలు