అనసూయ ఆ పాత్రలు చేయదు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మారుతి!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా మారుతి, గోపీచంద్ జబర్దస్త్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.

మారుతి అనసూయతో మాట్లాడుతూ పక్కా కమర్షియల్ యాంకర్ ను కలుద్దామని ఈ షోకు వచ్చానని వెల్లడించారు.అనసూయ మామూలు కమర్షియల్ కాదని చిన్నచిన్న పాత్రలు ఇచ్చినా చేయదని మారుతి చెప్పుకొచ్చారు.

గోపీచంద్ గెస్ట్ గా రావడంతో గోపీచంద్ సినిమాలలోని పేరడీ స్కిట్లు చేసి కడుపుబ్బా నవ్వించారు.ఈ నెల 30వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఇంద్రజ, మనో ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు.మరోవైపు జబర్దస్త్ షో స్కిట్లు గతంలోలా ఆకట్టుకోవడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

జబర్దస్త్ షో బోర్ కొడుతుందని పాత జబర్దస్త్ వీడియోలు వేయండి చూస్తామంటూ కొంతమంది నెటిజన్లు జబర్దస్త్ ప్రస్తుతం ఆకట్టుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు జబర్దస్త్ షోకు మూవీ ప్రమోషన్స్ కు వచ్చిన వాళ్ల సినిమాలు 95 శాతం ఫ్లాప్ అయ్యాయని కామెంట్లు చేస్తున్నారు.

పక్కా కమర్షియల్ హీరో గోపీచంద్, దర్శకుడు మారుతి కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాలి.

మారుతి అనసూయకు ఆఫర్లు ఇచ్చినా ఆ ఆఫర్లను ఆమె రిజెక్ట్ చేశారని మారుతి ఈ షో ద్వారా వెల్లడించారు.అయితే అనసూయ ఏ సినిమాలలో ఆఫర్లను వదులుకున్నారో తెలియాల్సి ఉంది.మారుతి డైరెక్షన్ లో నటించిన ఎంతోమంది నటులకు మంచి పేరు వచ్చింది.

అనసూయ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని అనసూయ భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు