మద్యం సేవించద్దని అత్త తిట్టిందని  అల్లుడు ఏకంగా...

ప్రస్తుత కాలంలో కొందరు మద్యానికి బానిసలై విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తమ కుటుంబాలను కష్టాల పాలు చేస్తున్నాయి.

తాజాగా ఓ వ్యక్తిని మద్యం సేవించవద్దని తన అత్త చెప్పడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని కొత్తపేట మండలానికి చెందిన ఓ గ్రామంలో లో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.అయితే ఇతడు ఇల్లరికం ఉండేవాడు.

దీంతో అప్పుడప్పుడు యువకుడు మద్యం సేవించేవాడు.గత పది రోజుల నుంచి కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవడంతో యువకుడు తరచూ మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చేవాడు.

దీంతో అతడి కుటుంబ సభ్యులు పలుమార్లు మద్యం సేవించద్దని చెప్పినప్పటికీ యువకుడు వారి మాటలు పెడచెవిన పెడుతూ ఉండేవాడు.అయితే తాజాగా మరోమారు యువకుడు మద్యం సేవించి ఇంటికి రావడంతో యువకుడి అత్త యువకుడితో మద్యం సేవించద్దంటూ గొడవ పడింది.

Advertisement

ఈ గొడవలో మాటామాట పెరిగింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన టువంటి యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం గమనించినటువంటి యువకుడి కుటుంబ సభ్యులు బాధితుడిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.  దీంతో స్థానికుల  నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు