మండల సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు గైర్హాజరు

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల సమక్షంలో చర్చించేందుకు శనివారం నేరేడుచర్ల మండల పరిషత్ లో ఎంపీపీ లక్కుమల్ల జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి మండలంలో 17 మంది సర్పంచులకు ముగ్గురు హాజరు కాగా,14 మంది సర్పంచులు డుమ్మా కొట్టారు.

దీనితో గైర్హాజరైన సర్పంచులకు ప్రజా సమస్యలు పట్టవా అంటూ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో పలు పెండింగ్ పనులను,వివిధ సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.పెంచికల్ దీన్నె ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలోని రిపోర్ట్ ఇవ్వమని వైద్యాధికారిని ఎంపీటీసీ యల్లబోయిన లింగయ్య అడగగా, వైద్యాధికారి చెప్పిన పొంతనలేని సమాధానంతో సభ కొద్దిసేపు రసాభాసగా మారింది.

అధికారుల నిర్లక్ష్య ధోరణి సరికాదని ప్రజా ప్రతినిధులు అన్నారు.అనంతరం సభ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ సమస్యనైనా అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.శంకరయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ,మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, ఎంపీటీసీలు యల్లబోయిన లింగయ్య,మండల రాజేష్, ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

Latest Suryapet News