Manchu Manoj : అనాథ పిల్లల ఆకలి తీర్చిన మనోజ్ దంపతులు.. వీళ్ల మంచి మనస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ( Manchu Manoj )గురించి మనందరికీ తెలిసిందే.

మోహన్ బాబు( Mohan Babu ) కొడుకుగా సినిమా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు మనోజ్.

మొన్నటి వరకు సినిమాలకు దూరంగా గడుపుతూ వచ్చిన మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.ఇది ఇలా ఉంటే మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం మౌనిక రెడ్డి ( Mounika Reddy )ప్రెగ్నెంట్.అంటే మంచు మనోజ్‌ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు.

అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు మనోజ్‌.కాగా ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా ఉంటున్నాడు.

Advertisement

ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల కోసం కొంచెం సమయం కేటాయిస్తుంటాడు మనోజ్‌.గతంలో అలాగే పెళ్లయిన తర్వాత తన భార్య మౌనికతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో పలు సార్లు అనాథ పిల్లలు, విద్యార్థులకు తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు.

తాజాగా కూడా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు మనోజ్.మౌనిక ప్రెగ్నెన్సీ గర్భం ధరించడంతో తాజాగా హైదరాబాద్‌లోని ఒక అనాథశ్రమానికి అక్కడి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశాడు.అంతేకాకుండా భార్యతో కలిసి స్వయంగా పిల్లలకు భోజనాలు వడ్డించాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు మనోజ్‌ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు