మంచు లక్ష్మికి ఆ ఆఫర్స్‌.. ఓకే చెప్తే వరుసగా సినిమాలు రావడం పక్కా!

మంచు లక్ష్మి నటిగా ఎన్నో సినిమాల్లో కనిపించింది.హీరోయిన్ గా కూడా ఈమె నటించాలని ఆశ పడింది కానీ ఎక్కువగా ఆఫర్లు రాలేదు.

దాంతో చేసేది లేక కేవలం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్ ను సాగిస్తూ వచ్చింది.కేవలం నటిగా మాత్రమే కాకుండా కెరీర్‌ ఆరంభం నుండి కూడా మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో నటిగా కూడా ఎక్కువ సినిమాలు చేయక పోవడం పట్ల ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో మంచు లక్ష్మికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరోయిన్‌ గా అయితే పెద్దగా గుర్తింపు స్టార్ డమ్‌ రాలేదు కానీ ఎక్కువ శాతం అభిమానులు ఆమెను నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నారు.

అంతే కాకుండా ఒక హుందా గా కనిపించే మహిళ పాత్రలో కూడా చూడాలని భావిస్తున్నారు.మంచు లక్ష్మి ఒక వేళ కనుక వరలక్ష్మి శరత్ కుమార్ తరహా లో నటించేందుకు ఓకే చెప్తే వరుసగా ఆఫర్లు వస్తాయి.

Manchu Lakshmi Not Doing More Films In Telugu Film Industry , Manchu Family , M
Advertisement
Manchu Lakshmi Not Doing More Films In Telugu Film Industry , Manchu Family , M

లేడీ ఓరియంటెడ్ సినిమా లను కూడా ఈమె నుండి ఆశించవచ్చు.కానీ చాలా వరకు మంచు వారి అమ్మాయి కనీసం కథ లు వినేందుకు కూడా ఓకే చెప్పడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న విమర్శల నేపథ్యం లో మంచు వారి అమ్మాయి సినిమా లకు దూరం అయ్యి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మంచు లక్ష్మి చిన్న గ్యాప్ తీసుకుంది.

కచ్చితంగా మళ్లీ ఫుల్‌ స్వింగ్‌ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్టార్‌ హీరోల సినిమా ల్లో లేడీ విలన్ పాత్రలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసేందుకు వరలక్ష్మి శరత్‌ కుమార్ ఓకే చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు