మంచు మనోజ్ పై ప్రాంక్.. సంతోషంతో గంతులేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్!

టాలీవుడ్ హీరో,నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే.

మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు తో ముచ్చటిస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు తన అభిమానులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది.ఇక మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వాణ తో కలసి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

మామూలుగానే మంచు లక్ష్మి తన మాటలతో, తన అందాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది.తన అల్లరికి కాస్త తన కూతురు విద్యా నిర్వాణ అల్లరి తోడవడంతో ఇద్దరూ కలిసి పలు రకాల ఫన్నీ వీడియోలను చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా మంచు లక్ష్మీ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టి అందులో కూడా పలురకాల ఫన్నీ వీడియోలు వంటకాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది.ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, కూతురు విద్యా కలసి మంచు మనోజ్ ని ఆట పట్టించారు.

Advertisement

అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఏప్రిల్ నెల సందర్భంగా ప్రతి ఒక్కరు ఏప్రిల్ ఫూల్ అని ఆటపట్టిస్తూ ఉంటారు.

అలా తాజాగా మంచు లక్ష్మీ తన కూతురు కలసి మంచు మనోజ్ ను ఏప్రిల్ ఫూల్ చేశారు.ఆ వీడియోలో మనోజ్ ఏదో మీటింగ్ లో బిజీ బిజీ గా ఉంటాడు.అప్పుడు విద్యా నిర్వాణ వెళ్లి తన చేతికి గాయం అయ్యింది అంటూ మంచు మనోజ్ కి చెబుతుంది.

అది నిజమేనని నమ్మిన మనోజ్ భయపడి మీటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని బయటకు వస్తాడు.ఇక బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయట పడుతుంది.

తనని విద్యా నిర్వాణ ప్రాంక్ చేసిందని ఇదంతా కూడా మంచు లక్ష్మి ప్లాన్ అని అర్థం అవుతుంది.ఇక మనోజ్ ని ఏప్రిల్ పూల్ చేసినందుకు మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణ ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు.అప్పుడు మంచు మనోజ్ ఏమీ అనలేక నవ్వుతూ నిలబడిపోతాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తన మామయ్యను ఆటపట్టించడం అంటే తన కూతురు విద్య నిర్వాణ కు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియోని చూసిన మంచు అభిమానులు సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు