వరుణ్ తేజ్ గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అతనంటే గౌరవం అంటూ?

టాలీవుడ్ మెగా హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గని.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 Allu Arjun Sensational Comments On Hero Varun Teja, Mega Hero Varun Tej, Ghani,-TeluguStop.com

ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు బాబీ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇంటి దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.నాకు ఒక కోరిక ఉండేది.

మా నాన్న ఒక నిర్మాత.ఆ తర్వాత మా తమ్ముడు కూడా నిర్మాత అవుతాడు అని అనుకున్నాను కానీ హీరో అయ్యాడు.

మా అన్న సినిమాల కోసం పని చేశాడు.మా అన్నకు ఎంతో నాలెడ్జ్ కూడా ఉంది.

కానీ ఎప్పుడూ ముందుకు రాలేదు.కానీ ఈ సినిమా కోసం నిర్మాతగామారాడు.

ఇకపై మా నాన్న లాగా నన్ను నడిపించడానికి మా అన్న బాబీ ఉన్నాడు చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

Telugu Allu Arjun, Ghani, Ghani Pre, Varun Tej-Movie

అనంతరం వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి వరుణ్ తేజ్ అంటే చాలా ఇష్టమని మా ఫ్యామిలీ లో అందరి కంటే వరుణ్ తేజ్ అందంగా ఉంటాడు అని తెలిపాడు.పుట్టుకతోనే వరుణ్ తేజ్ అందంగా ఉన్నాడు అని అప్పటి నుంచి వరుణ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపారు అల్లు అర్జున్.కానీ వరుణ్ తేజ్ సినిమాలలోకి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ పై తనకు గౌరవం పెరిగింది.

Telugu Allu Arjun, Ghani, Ghani Pre, Varun Tej-Movie

వరుణ్ తేజ్ ఎంచుకునే సినిమాలు, జానర్లు, కథని చూసి గౌరవం పెరిగిందని, సినిమా హిట్టా పట్టా అనే సంబంధం లేకుండా వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు అని తెలిపాడు.అనంతరం అభిమానుల గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చిన మెగా అభిమానులకు థ్యాంక్స్.వరుణ్ తేజ్ ను కూడా ఎప్పుడూ ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి .నా అభిమానులకు కూడా థ్యాంక్స్ అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube