ఆకాశంలో తేలుతూ కళ్లు తిరిగే విన్యాసం.. వీడియో వైరల్

సాహస క్రీడలను చాలా మంది ఇష్టపడుతుంటారు.స్కై డైవింగ్( Sky Diving ) చేస్తుంటారు.

ఇంకొందరు పారా గ్లైడింగ్ ట్రై చేస్తుంటారు.బంగీ జంప్ కూడా ప్రయత్నిస్తుంటారు.

అయితే ఇంకొందరు బైక్ స్టంట్స్ చేస్తుంటారు.ఇలా ప్రాణాలు పణంగా పెట్టి విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు.

అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియాలో లైకులు, షేర్లు, వ్యూస్ పెంచుకోవడమే వారికి ఇష్టం.అయితే అందుకు ప్రాణాలు పణంగా పెట్టి చాలా సార్లు విమర్శలు పాలవుతుంటారు.

Advertisement

అయినా కొందరు పట్టించుకోరు.అయితే వారు చేసే విన్యాసాలు ఇతరులకు భయం పుట్టిస్తాయి.

వారి చర్యలు ఇంకొందరు అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

చాలా మందికి ఆకాశంలో నుంచి కిందికి దూకుతూ పారా గ్లైడింగ్( Para Gliding ) చేస్తుంటారు.ఒక్కసారిగా విమానంలో నుంచి పారాచ్యూట్ కట్టుకుని కిందికి దూకుతారు.ఇలాంటి సాహస క్రీడల్లో ఇతరులకు భయం పుట్టిస్తాయి అయితే వాటిని చేసే వారు మాత్రం కొంచెం కూడా భయపడరు.

ఇలాగే ఓ వ్యక్తి పారా గ్లైడింగ్ చేశాడు.ఆ సమయంలో అందరిలా కాకుండా ఇంకొంచెం విచిత్రంగా ప్రవర్తించాడు.ఆకాశంలో ఉండగానే ఒక గిన్నె బయటకు తీశాడు.తర్వాత అతను తృణధాన్యాల ప్యాకెట్ తీసి గిన్నెలో వేశాడు.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
దొరికేసాడు.. దొరికేసాడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో.. (వైరల్ వీడియో)

చివరికి అతను అరటిని( Banana ) చిన్న ముక్కలుగా కట్ చేసి, గిన్నెలో పండును కూడా కలుపుతాడు.

Advertisement

చివరగా, అతను ఒక చిన్న బాటిల్ పాలను తీసి, తృణధాన్యాలపై కొంత పోస్తాడు.దీని తర్వాత అతను చాలా ఉత్సాహంతో ఈ వంటకాన్ని రుచి చూస్తాడు.తరువాత, కెమెరా అతను నేలపై దిగినట్లు చూపిస్తుంది.

ఈ దృశ్యాలు చూసిన వారంతా చాలా భయపడ్డారు.ఓ వైపు ఆకాశంలో నుంచి నేలపైకి దిగుతూ ఇలా చేయడం అందరినీ భయంలో ముంచెత్తింది.

ఏ మాత్రం పట్టు తప్పినా అతడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.అయినా అతడు ఏ మాత్రం భయపడలేదు.

తాను అనుకున్న పని పూర్తి చేశాడు.నెటిజన్లు మాత్రం అతడి స్టంట్‌కు భయపడ్డారు.

భూమి మీద బ్రేక్ ఫాస్ట్( Breakfast ) చేయడానికి ప్లేస్ లేదా అని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు