ఒంటి చేత్తోనే రుచికరమైన పావ్ బజ్జీ తయారీ.. ఆదర్శంగా నిలుస్తున్నాడు

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎన్నో ఆసక్తికర వీడియోలు మనకు తెలుస్తున్నాయి.అందులో కొన్ని నవ్వించేవి ఉంటే మరికొన్ని ఆశ్చర్యపరిచేవి ఉంటున్నాయి.

తాజాగా ఇటీవల వైరల్ అవుతున్న వీడియో ఎందరికో స్పూర్తినిస్తోంది.అసంఖ్యాకమైన అసమానతలను, అవరోధాలను అధిగమించి విజయం సాధింవచ్చు అనే సందేశాన్ని ఇస్తోంది.

ఇదంతా ఓ పావ్ భాజీ విక్రేతకు చెందిన స్టోరీ.ముంబైలోని మలాడ్‌లోని తన పావ్ భాజీ స్టాల్‌లో ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తి పనిచేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Advertisement

కొన్నాళ్ల క్రితం దురదృష్టవశాత్తు ఓ ప్రమాదంలో చేతిని పోగొట్టుకున్నప్పటికీ, తన పొట్టకూటి కోసం కష్టపడి పని చేస్తున్నాడు.వీధి వ్యాపారం ద్వారా పావ్ బజ్జీలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, మితేష్ గుప్తా అనే వ్యక్తి ఒక చేత్తో పావ్ భాజీ చేస్తూ, కూరగాయలు కోస్తూ కనిపించాడు.

కత్తిని తన చేతికింద ఉంచి కూరగాయలను చేతిలో పట్టుకుని కోసుకున్నాడు.దురదృష్టవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదంలో చేయి కోల్పోయిన మితేష్ గుప్తా, ఇప్పటికీ ముంబైలోని మలాడ్‌లో పావ్ భాజీ స్టాల్ నడుపుతున్నాడు.

దీనిపై పోస్ట్ చేసిన చిన్న ఈ వీడియోకు 37వేలకు పైగా వీక్షణలు, అసంఖ్యాక స్పందనలు వచ్చాయి.చాలా మంది చిన్న చిన్న సమస్యలకే మానసికంగా కుంగిపోతుంటారు.తమ జీవితం మొత్తం అంతమై పోయిందని బాధ పడిపోతుంటారు.

అలాంటి వారికి ఇతడి జీవితం ఆదర్శమనే కామెంట్లు వస్తున్నాయి.ఒక చేయి లేకపోయినా, ఒంటి చేత్తోనే తన బతుకు బండి లాగిస్తున్న వైనం పలువురి కళ్లు తెరిపిస్తోంది.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??
Advertisement

తాజా వార్తలు