సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.మరి ఈయనకు ఆ స్థాయిలో ఫాలోయింగ్ రావడానికి ఆయన కెరీర్ లో చేసిన కొన్ని సినిమాలే కారణం.
మరి అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో పోకిరి ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా మహేష్ ఆల్ టైం హిట్ లలో ఒకటిగా మిగిలి పోయింది.
ఈ సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు అయినా చూడడానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ముందు ఉంటారు.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఎవ్వరికి పోలేదు.మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టింది.2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయినా ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను దాటి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.అప్పట్లోనే 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.ఈ సినిమా హిట్ తో మహేష్ ఇమేజ్ మారిపోయింది అనే చెప్పాలి.

అప్పటి వరకు స్టార్ హీరో రేంజ్ కు చివరి మెట్టులో ఉన్న మహేష్ ఆ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు.ఇక ఈయనకు జోడీగా నటించిన ఇలియానా సైతం స్టార్ హీరోయిన్ అయ్యింది.వీరిద్దిరి జోడీ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.మరి అలంటి సినిమాను మరోసారి రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.నేటి అధునాతన డిజిటల్ సాంకేతికతను జోడించి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఈసారి మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఈ స్పెషల్ ట్రీట్ రెడీ చేయడానికి సిద్ధం అయ్యారు.ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేసి స్పెషల్ గిఫ్ట్ ను ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు.
మరి మహేష్ పోకిరి సినిమా రీ రిలీజ్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.








