జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం చేయండి...డాక్టర్ బి శరణ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండలంలో గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము విజయవంతం చేయాలని డాక్టర్లు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పౌష్ఠికాహారలోపం, ఆకలి మందగించటం, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, బరువు తగ్గటం( Weight loss ), మొదలగు లక్షణాలు కనిపిస్తాయని,వీటి నిర్మూలనకు 1 సంవత్సరం" నుండి 19 సంవత్సరం" పిల్లలకి ప్రతి అంగన్వాడీ కేంద్రం లో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో, కాలేజీ ల్లో అల్బెండజోల్ టాబ్లెట్ వేయబడునని అన్నారు.

1 స " నుండి 2స" పిల్లలకి సగం టాబ్లెట్, 2 స" నుండి 19స" పిల్లలకి పూర్తి టాబ్లెట్ చప్పరించి నమిలి మింగవలెనని తెలిపారు.గురువారం వేసుకోలేనివారు, పిల్లలకి( Child ) తిరిగి 10 తేదీన మోప్ అప్ డే రోజు ఇవ్వబడునని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, యువకులు, అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News