50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న మహేష్ తల్లి.. నటీ రియాక్షన్ ఇదే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి సుకన్య( Sukhanya ) ఒకరు.

సుకన్య అంటే ఈ తరం వాళ్ళు గుర్తుపట్టకపోవచ్చు కానీ శ్రీమంతుడు ( Sreemanthudu )! సినిమాలో మహేష్ బాబు ( Mahesh Babu ) కి తల్లిగా నటించిన నటి అంటే మాత్రం గుర్తుపడతారు.

ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందింది నటి సుకన్య.తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో పలు ల్లో హీరోయిన్‌గా నటించింది.

తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్‌, ఖైదీ నెంబర్‌ వన్‌ తదితర ల్లో హీరోయిన్‌గా నటించారు.

ఇలా హీరోయిన్ గా నటిస్తూ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి సాంబ, శ్రీ మున్నా ఆది నాయకుడు శ్రీమంతుడు వంటి సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించారు.కుల కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె 2002వ సంవత్సరంలో శ్రీధరన్( Sreedharan ) అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలకు వెళ్లిపోయారు.అయితే కొంతకాలం తర్వాత ఇద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని తిరిగి ఇండియా వచ్చారు.

Advertisement

ఇలా ఇండియా వచ్చినటువంటి ఈమె తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నటువంటి తరుణంలో ఈమె రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.భర్తకు విడాకులు ఇచ్చినటువంటి సుకన్య త్వరలోనే రెండవ వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలపై ఈమె స్పందించారు.ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ ప్రస్తుతం నా వయసు 50 సంవత్సరాలు.

ఇప్పుడు నేను రెండో పెళ్లిచేసుకుంటే పుట్టే పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తారా లేక అమ్మమ్మ అని పిలుస్తారా అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు