మహేష్‌బాబు వ్యాపారం బెంగళూరుకూ విస్తరించబోతున్నాడట

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఒక వైపు హీరోగా నటిస్తూ కోటాను కోట్లు పారితోషికంగా తీసుకుంటూ మరో వైపు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోటాను కోట్లు అలా కూడా సంపాదిస్తున్నాడు.

ఇక ఈమద్య కాలంలో మహష్‌ బాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరియు మల్టీప్లెక్స్‌ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

హైదరాబాద్‌లో ఎఏంబీ అనే మల్టీప్లెక్స్‌ను మహేష్‌బాబు ఏర్పాటు చేయడం జరిగింది.ఇప్పుడు దాన్ని విస్తరించబోతున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏఎంబీ రెండవ బ్రాంచ్‌ను బెంగళూరులో ప్రారంభించబోతున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఈ వెంచర్‌ను మహేష్‌బాబు మొదలు పెట్టబోతున్నట్లుగా కన్నడ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.2021లో ఈ కొత్త ఏఎంబీ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో వైజాగ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్‌ను నిర్మించబోతున్నారు.

Mahesh Babu To Start Amb Multiplex In Bangalore

మరో వైపు మహేష్‌ బాబు హీరోగా దూసుకు పోతున్నాడు.సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన సమ్మర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తనకొత్త సినిమాను చేయబోతున్నాడు.ఆ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Mahesh Babu To Start Amb Multiplex In Bangalore-మహేష్‌బాబు

వంశీ పైడిపల్లి ఈ చిత్రంలో మహేష్‌బాబును జేమ్స్‌ బాండ్‌ పాత్రలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన రాబోతుంది.

ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు