పండుగ వేళ కూచిపూడి డ్యాన్స్ ట్రీట్.. సితార పట్ల గర్వంగా ఉంది అంటూ మహేష్ ట్వీట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో ఎంత డెడికేషన్ చూపిస్తాడో తన ఫ్యామిలీ తో స్పెండ్ చేయడానికి కూడా అంతే ఇష్ట పడతాడు.

కొద్ది సమయం వచ్చిన ఫారెన్ ట్రిప్స్ కు వెళ్లి తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తాడు.

ఆ తర్వాతనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు.ఇక మహేష్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు.

తన కూతురు సితార తో మహేష్ బాబు చాలా క్లోజ్ గా ఉంటాడు.మరి అలాంటి స్టార్ కూతురు ఇప్పుడు వెండి తెర మీద ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా సితార టాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.అది కూడా తన తండ్రి చేస్తున్న సర్కారు వారి పాట సినిమాతో సితార ఎంట్రీ ఇచ్చింది.

Advertisement
Mahesh Babu Shares Daughter Sitara's FIRST Kuchipudi Dance Video, Happy Sri Rama

ఈ పాట లో సితార అందరిని మెస్మరైజ్ చేసింది.ఈమె డ్యాన్స్ టాలెంట్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇది ఇలా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఈ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు.సితార మరోసారి సూపర్ స్టార్ అభిమానులను ఫిదా చేసింది.

ఈమె తనలోని మరో టాలెంట్ ను బయటకు తీసింది.పండుగ వేళ ఈమె ఇచ్చిన సర్ప్రైజ్ అందరికి నచ్చింది.

ఈ రోజు శ్రీరామ నవమి పండుగ అని అందరికి తెలిసిందే.మరి ఈ పండుగ వేళ సెలెబ్రిటీలు ఫ్యాన్స్ కు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

మహేష్ కూడా పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేసాడు.

Mahesh Babu Shares Daughter Sitaras First Kuchipudi Dance Video, Happy Sri Rama
Advertisement

సితార మొదటిసారి కూచిపూడి డ్యాన్స్ చేసిన వీడియోను ఈ పండుగ రోజు షేర్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.అలాగే ఈమె పట్ల గర్వంతో కూడిన ట్వీట్ కూడా చేసారు.సితార మొదటి కూచిపూడి డ్యాన్స్.

ఈ పండుగ రోజు మీకు ప్రదర్శించడం సంతోషంగా ఉంది.ఈ శ్లోకం శ్రీరాముడి గొప్పతనాన్ని తెలుపుతుంది.

నా సీతూ పాపా.నీకు క్రాఫ్ట్ పట్ల అంకితభావం నాకు ప్రతీ సారి విస్మయం కలిగిస్తుంది.మీరు నన్ను మరింత గర్వించేలా చేస్తున్నారు.

నీకు మరింత ఆదరణ, ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను.మీ అందరికి శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు.

అంటూ మహేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.

తాజా వార్తలు