మదర్ సెంటిమెంట్.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గురు?

ప్రతి సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేసేది.హృదయానికి చేరుకునేలా చేసేది ఎమోషన్ మాత్రమే.

 Tollywood Movies With Mother Sentiment ,tollywood , Mother Sentiment, Vijya De-TeluguStop.com

అందుకే సినిమాల్లో ఎమోషన్స్ సరిప్పాళ్లలో ఉందా లేదా అని దర్శకులు ఎప్పుడూ జాగ్రత్త పడుతూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఎమోషనల్ సీన్స్ బాగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయ్.

సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కామెడీ ట్రాక్ ఎంత ఉన్న ఎమోషన్ సీన్స్ మాత్రం బాగుండాలి.ఈ క్రమంలోనే ఇప్పటి దర్శకులు అందరూ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు అన్నది తెలుస్తుంది.

ఎంత కొత్త కథలతో తెర మీదికి వచ్చిన అటు ఎమోషన్ ని మాత్రం బాగా దట్టిస్తూ ప్రేక్షకులకు సినిమా చేరే విధంగా చేస్తూ ఉన్నారు.ఇటీవలికాలంలో ప్రతి సినిమాలో తల్లి సెంటిమెంట్ తెర మీదికి వస్తుంది.

కన్నడ ఇండస్ట్రీ నుండి విడుదలై భారత దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయిన సినిమా కేజీఎఫ్.ఇక ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ సినిమా.పూర్తిగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పాలి.అయితే ఈ సినిమాలో ఎన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఈ సినిమాకు ప్రాణం పోసింది మాత్రం తల్లి సెంటిమెంట్ అనే చెప్పాలి.

ఇచ్చిన మాట కోసం రాఖీ బాయ్ తన జీవితాన్ని ఎలా మౌల్డ్ చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా.సినిమా సూపర్ హిట్ అవ్వగా ఇక దీనికి కంటిన్యూషన్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Amala, Ghani, Kgf, Liger, Mother, Nadiya, Prashanth Neel, Sharwanandh, To

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాలో కూడా సినిమా కూడా కథ నడిచేది మాత్రం తల్లి ప్రేమతోనే అన్నది తెలుస్తుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది.

స్లమ్ లో ఉండే తల్లి తన కొడుకుని పెద్దవాడిగా చూసేందుకు ఎంతో కష్టపడింది అనేదే ఈ సినిమా కథ అంటూ టాక్ ఉంది.

Telugu Amala, Ghani, Kgf, Liger, Mother, Nadiya, Prashanth Neel, Sharwanandh, To

ఇక శర్వానంద్ అమల లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ఒకే ఒక జీవితం.ఇక ఈ సినిమాలో కూడా తల్లి సెంటిమెంట్ సినిమాను ముందుకు నడిపించ పోతుందట.ఏకంగా అమల కథ వినగానే అమ్మ క్యారెక్టర్ చేస్తా అమల అని స్వయంగా చెప్పిందట.

దీన్ని బట్టే ఇక ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గని సినిమా కూడా తల్లి సెంటిమెంట్ తోనే కథ నడిచింది.

ఇక వరుణ్ తేజ్ తల్లిగా నదియా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube