సర్కారు వారి పాట రిజల్ట్ విషయంలో మహేష్ అలా రియాక్ట్ అయ్యారా.. ఏమైందంటే?

సర్కారు వారి పాట సినిమాకు తొలిరోజు జరిగిన ప్రచారంను చూసి మహేష్ బాబు అభిమానులు ఒకింత టెన్షన్ పడ్డారు.

వరుస హిట్లతో జోరుమీదున్న మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమాతో ఫ్లాప్ చేరుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.

ఈ మధ్య కాలంలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా ఫలితాన్ని ముందుగానే ఊహించారని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా ఫలితంపై మహేష్ బాబు ఫస్ట్ రియాక్షన్ గురించి దర్శకుడు పరశురామ్ స్పందిస్తూ ఈ సినిమా ఫలితం విషయంలో మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారని సర్కారు వారి పాట రిలీజైన రోజున ఉదయం 8 గంటలకే మహేష్ బాబు కాల్ చేశారని పరశురామ్ చెప్పుకొచ్చారు.ఫోన్ కాల్ లో మహేష్ బాబు తనకు కంగ్రాట్స్ చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.

అదే రోజు రాత్రి అందరం కలిసి పార్టీ చేసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

మహేష్ బాబు చిన్న పిల్లాడిలా అయిపోయారని ఆయన పార్టీ చేసుకున్నారని పరశురామ్ పేర్కొన్నారు.సర్కారు వారి సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డానని ఆ కష్టానికి తగిన ఫలితం అయితే దక్కిందని పరశురామ్ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు తన రైటింగ్ స్కిల్స్ ను మెచ్చుకోవడంతో పాటు రైటింగ్ స్కిల్స్ ను ఇదే విధంగా కంటిన్యూ చేయాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ డైరెక్టర్ల నుంచి కూడా పరశురామ్ కు అభినందనలు దక్కుతున్నాయని తెలుస్తోంది.పరశురామ్ తర్వాత సినిమా చైతన్యతో తెరకెక్కనుంది.అయితే సర్కారు వారి పాట సక్సెస్ సాధించినా పరశురామ్ కు మరో స్టార్ హీరో అవకాశం ఇస్తారా అనే ప్రశ్నకు చెప్పలేమనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు