SSMB28 : కథ సిద్దం కాకుండానే టైటిల్ అంటే ఎలా?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

సర్కారు వారి పాట సినిమా పూర్తి కాకుండానే తదుపరి సినిమా ను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్నాడు.అతడు, ఖలేజా ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అభిమానులు ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సినిమా షూటింగ్‌ ప్రారంభం ఎప్పుడు అనే విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

కాని ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమా కు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్ మరియు టైటిల్ ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయమై స్పష్టత ఇచ్చారు.

Advertisement

ఇప్పటి వరకు మహేష్‌ బాబు 28వ సినిమాకు సంబంధించిన కథను త్రివిక్రమ్‌ ఫైనల్‌ చేయలేదు.కథ కాకుండానే టైటిల్‌ మరియు కాన్సెప్ట్‌ పోస్టర్ ఎలా విడుదల చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

నెట్టింట ప్రచారం జరుగుతున్న టైటిల్‌ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన టైటిల్‌ విషయంలో చర్చలు జరగలేదు అంటున్నారు.

కాని మీడియా సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా కు పార్థు అనే టైటిల్‌ ను దాదాపుగా ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.ఇదే సమయంలో ఈ సినిమాకు అతడు పార్థుఅనే టైటిల్‌ ను కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి పుకార్లు చాలా ప్రచారం జరుగుతున్నాయి.కాని ఇప్పటి వరకు వచ్చిన వార్తల్లో ఏది నిజం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు