Madhuri Dixit : మాధురి దీక్షిత్..తెలుగు వారికి ఒక హిందీ టీచర్ !

తెలుగు వారికి తెలుగు సినిమాలే అర్థం కాని పరిస్థితి.

అప్పట్లో సినిమా అంటే హీరో ఫైట్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, సినిమా చూడాలి అని అనుకునేవారు.

అంతకన్నా ముందు భక్తి భావన ఉన్న సినిమాలకు ఎక్కువగా ఆదరణ ఉండేది.కానీ సినిమా అంటే అసలు మనది కాదు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ( Bollywood Industry ) అని ఒక తరం వారిని ఊపు ఊపేలా చేయడంలో హిందీ చిత్ర పరిశ్రమ సక్సెస్ అయింది అంటే కారణం అప్పటి కొంత మంది తారలు.

అందులో మాధురి దీక్షిత్ పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి.ఎందుకంటే తెలుగు వారికి ఆమె ఒక హిందీ టీచర్.

అప్పటివరకు హిందీ సినిమా వాసన పెద్దగా తెలియని తెలుగు వారికి హిందీ రుచి చూపించింది.మాధురి దీక్షిత్( Madhuri Dixit ) పేరు చెబితే చాలు అప్పటి కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి.ఆమె హావ భావాలతో జనాల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.

Advertisement

ఆమె ఒక రెండు తరాలకు ఆరాధ్య నటి అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.మాధురి దీక్షిత్ ఉంది అంటే ఆమె పక్కన ఉన్న నటీనటులంతా పక్కకు వెళ్లి పోవాల్సిందే.

ఏక్.దో.తీన్( Ek Do Teen Char Song ) అంటూ ఆమె కుర్ర కారు హృదయాలను గిలిగింతలు పెట్టిన వెండితెర మహారాణి.హీరోలను మించి స్టార్ డం సొంతం చేసుకుంది.

మాధురి దీక్షిత్ ఉంటే చాలు హీరో ఎవరన్నది పట్టించుకోని సందర్భం.అలా దాదాపు 20 ఏళ్ల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

అప్పట్లో మాధురి దీక్షిత్ సినిమా వచ్చింది అంటే చాలు ఎంత పని ఉన్నా కూడా అన్ని వదులుకొని మరీ వెళ్లే వాళ్ళు తెలుగు వారు.అలా మాధురి దీక్షిత్ పుణ్యాన చాలా మందికి హిందీ కూడా వచ్చింది.ఇక ఆమె ఇప్పుడు సినిమాలు మానేసిన కూడా మాధురి పాత సినిమాలు( Madhuri Dixit Movies ) చూస్తే ఎక్కడ లేని సంతోషం కలుగుతూ ఉంటుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఏది ఇది ఏమైనా మాధురి లాంటి మా హీరోయిన్ మళ్ళీ పుట్ట లేదంటే నమ్మాల్సిందే.

Advertisement

తాజా వార్తలు