మధుబాల సినిమాలకు దూరం కావడానికి అసలు కారణమిదా.. అలా జరగడంతో?

ప్రముఖ టాలీవుడ్ నటి మధుబాల( Madhubala ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రోజా సినిమా( Roja movie )తో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన ఈ నటికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో 50కు పైగా సినిమాలలో నటించిన ఈ నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

శాకుంతలం సినిమాలో మధుబాల కీలక పాత్రలో నటించగా మరో 36 గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మధుబాల లింగ వివక్ష గురించి మాట్లాడుతూ నా నటనా జీవితం ముగిసే సమయానికి సరైన రోల్స్ లభించలేదని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం కొందరు సినీ హీరోయిన్లు ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో మార్చేశాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

టైప్ క్యాస్ట్ గురించి మధుబాల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను హీరోయిన్ రోల్స్ చేశానని ఆ సమయంలో హీరోయిన్లంతా టైప్ క్యాస్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.మాకు కొన్ని అద్భుతమైన పాటలున్నాయని డ్యాన్స్ చేశామని రొమాంటిక్ సీన్స్ చేయడంతో పాటు వేర్వేరు భాషల్లో వైవిధ్యంతో ఉన్న పాత్రలు పోషించామని ఆమె అన్నారు.

Advertisement

నాకు నచ్చిన రోల్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యానని మధుబాల తెలిపారు.

ఆ సమయంలో ఇంకా ఎక్కువ సినిమాలలో నటించాలని అనుకున్నానని కానీ నాకు తగిన రోల్స్ రాలేదని ఆమె చెప్పుకొచ్చారు.నేను యాక్షన్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటించానని ఆమె చెప్పుకొచ్చారు.శాకుంతలం సినిమాతో మధుబాలకు మరో సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

ఈ సినిమాలో ఆమె మేనక పాత్రలో నటించారు.హీరోయిన్ సమంత( Samantha ) శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు