పిల్లుల ద్వారా ఇతర పిల్లులకు కరోనా వ్యాప్తి?

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా.

లాక్ డౌన్ విధించి ప్రజలను ఎవరిని బయటకు రాకుండా చేసి ఆర్ధికంగా నష్టపోయిన సరే ఇంట్లోనే పెట్టినప్పటికీ కొంచం నిర్లక్ష్యంగా ఉంటే చాలు మళ్లీ వచ్చేస్తుంది ఈ కరోనా.

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రపంచమంతా ఏకమై పరిశోధనలు చేస్తుంది.ఇంకా ఈ నేపథ్యంలో అమెరికా పరిశోధనలో మరో షాకింగ్ విషయం బయటపడింది.

అది ఏంటి అంటే? కరోనా వైరస్ వ్యాధి సోకిన పిల్లుల నుంచి ఇతర పిల్లులకు కరోనా వ్యాపిస్తుందని తేలింది.ఎలా అంటే? కరోనా బారిన పడిన ఓ వ్యక్తికి సన్నిహితంగా ఉన్న మూడు పిల్లులను కేంద్రంలో ఉంచి అమెరికాలోని విస్కన్ సన్ విశ్వ విద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు.

కరోనా ఉన్న పిల్లులకు దగ్గరగా మరికొన్ని పిల్లులను ఉంచారు.ఇంకా ఆ తర్వాత వాటి ముక్కు నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు.అయితే ఆ పిల్లలలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కరోనా వైరస్ సోకిందని నిర్దారించారు.

Advertisement

అయితే పిల్లుల నుండి మనుషులకు కరోనా సోకుతుందా లేదా అనేది ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పారు.దీనిపై మరికొన్ని పరిశోధనలు చెయ్యాలి అని పేర్కొన్నారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు