సొసైటీ అధికారుల నిర్లక్ష్యంతో 66 మందికి వర్తించని రుణమాఫీ

సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం ఎర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రుణమాఫీకు దూరమయ్యారు.సొసైటీ సిబ్బంది రుణమాఫీ వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహించడంతో 66 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అందలేదు.

అన్ని అర్హతలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్లే మాకు రుణమాఫీ రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.66 మంది రైతుల రుణమాఫీ పేర్లను ఆన్లైన్ నమోదు చేయకపోవడంతో పెద్ద దుమారం లేచింది.సంవత్సరం,రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న రుణాలను ఎందుకు నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించారు.

సహకార సంఘం అధికారుల,సీఈఓల బదిలీలు లేకపోవడంతో సహకార సంఘం కార్యాలయంలో ఆడింది ఆట పాడింది పాటగా తయారైందనే ఆరోపణలు ఉన్నాయి.వాళ్లకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాధిత రైతులు మండిపడుతున్నారు.

ఎర్రవరం గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయంలో 1080 మంది సభ్యులు రుణాలు తీసుకోగా వారిలో భిక్యాతండా నుంచి 304,ఎర్రవరం నుండి 420,రామలక్ష్మీ పురం నుండి 360 మంది సహకార సంఘం నుంచి రుణాలు తీసుకున్నారు.వారిలో ఇప్పటివరకు 449 మందికి రుణమాఫీ జరిగింది.

వీరిలో కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో అధికారులను నిలదీశారు.ఇదే విషయమై సీఈఓ హుస్సేన్ వివరణ కోరగా ఎర్రవరం సహకార సంఘంలో 1080 మంది సభ్యుల పేర్లు పంపించామని, బుధవారం వరకు 500 మంది పేర్లు వచ్చాయని,2 కోట్ల 30 లక్షల రుణమాఫీ అయ్యిందని, మిగిలిన సభ్యులకు ఇంకా రావాల్సి ఉందని,కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదం వల్ల 66 మందికి రాలేదని చెప్పడం గమనార్హం.

Advertisement
రెండు నెలలు బ్రేక్ లేకుండా 1200 కి.మీ ప్రయాణించిన పిల్లి.. చివరికి..?

Latest Suryapet News