Anand Devarakonda Baby Movie: బేబీ.. ఏంటి భయ్యా ఇది మరో కలర్ ఫొటోనా

గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కలర్ ఫోటో జాతీయ అవార్డు ను సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తా చాటిన విషయం తెలిసిందే.

ఆ సినిమా డైరెక్టర్ గా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఇప్పుడు బేబీ అనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.ఈ సినిమా లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించడంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఈ సినిమా లో నటించింది.గతం లో ఈమె ఒకటి రెండు సినిమాల్లో నటించినా అవి పెద్దగా పాపులారిటీని సొంతం చేసుకోలేక పోయాయి.

ఈ సినిమా లో ఆమె కు మరీ మసీ పూసినట్లుగా మేకప్ వేశారు అంటూ కొందరు విమర్శలు చేసినా కూడా ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యత అయితే దక్కినట్లుగా టాక్‌ వస్తుంది.లుక్ పరంగా విమర్శలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి డీసెంట్ విజయాన్ని సొంతం చేసుకుని కలర్ ఫోటో స్థాయిలో సక్సెస్ దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం తో ఉన్నారు.

Advertisement

ఈ సినిమా ను గీతా ఆర్ట్స్ కి చెందిన ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.ఈయన గతం లో విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమా ను నిర్మించాడు.

అప్పుడు అన్న తో సినిమా ను నిర్మించి సక్సెస్ దక్కించుకున్న ఈయన ఇప్పుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి సినిమా ను తెరకెక్కించాడు.

ఇది ఒక మంచి ప్రయత్నం అంటూ వార్తలు వస్తున్నాయి.తప్పకుండా ఈ సినిమా ఒక డీసెంట్ సక్సెస్ దక్కించుకోవడంతో పాటు కలర్ ఫోటో మాదిరిగానే జాతీయ స్థాయి అవార్డు ను సొంతం చేసుకుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల కంటే ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమా లు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి.

కనుక ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం ను ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.అతి త్వరలోనే సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు.

వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
Advertisement

తాజా వార్తలు