రూ.315 కోట్లు విరాళం ఇచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే..?

కరోనా కష్ట కాలంలో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

చాలామంది హీరోలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సాయం చేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు.

కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే హీరోలు, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న నాయకులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.సోనూసూద్ లాంటి పెద్దగా గుర్తింపు లేని నటులు భారీ మొత్తంలో సాయం చేస్తుంటే స్టార్ హీరోలు ప్రజలకు ఆర్థిక సాయం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leonardo Dicaprio Doantes 315 Crores Rupees For Rare Animals , Doantes 315 Crore

అయితే ఒక స్టార్ హీరో మాత్రం జంతువులు, పక్షుల జాతులను పరిరక్షించడం కొరకు ఏకంగా 315 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం గమనార్హం.లక్షల్లో, వేలల్లో విరాళాలు ఇవ్వడానికి కొందరు హీరోలు బాధ పడుతుంటే లియోనార్డో డికాప్రియో మాత్రం భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.

టైటానిక్ మూవీ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న లియోనార్డో డికాప్రియో ప్రకృతిపై తనకు ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు.ఈ హీరో ఇలా వందల కోట్లు సహాయం చేయడం తొలిసారి కాదు.

Advertisement

గతంలో కూడా ఈ హీరో ఈ విధంగా సాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని లియోనార్డో డికాప్రియో ప్రూవ్ చేసుకున్నారు.

ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అరుదైన ప్రాణులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.ఆ అరుదైన ప్రాణుల సంరక్షణ కోసం లియోనార్డో తన వంతు సాయం చేశారు.

లియోనార్డోను చూసైనా సెలబ్రిటీలలో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.రీ వైల్డ్ సంస్థ అరుదైన ప్రాణులను సంరక్షించడానికి ముందుకు రాగా లియోనార్డోతో పాటు మరి కొందరు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు