వారిని కలవడానికి వెళ్లి గాయాలు పాలైన లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్!

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈయన దర్శకత్వం వహించినది కేవలం ఐదు సినిమాలు అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరిని కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేయడంతో ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఇలా డైరెక్టర్ లోకేష్ దర్శకత్వంలో తాజాగా హీరో విజయ్( Vijay )నటించిన లియో సినిమా( Leo Movie )ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

Leo Director Lokesh Kanagaraj Injured Kerala Tour , Leo Movie, Lokesh Kanagaraj,

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మిశ్రమ స్పందన లభించుకుంది అయితే దసరా పండుగ నేపథ్యంలో ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.ఇక ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టడంతో డైరెక్టర్ లోకేష్ ప్రమోషన్లలో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటించడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈయన ముందు కేరళ వెళ్లారు.

Advertisement
Leo Director Lokesh Kanagaraj Injured Kerala Tour , Leo Movie, Lokesh Kanagaraj,

కేరళలోని పాలక్కాడ్ లోని అరోమా థియేటర్ కు వెళ్లి అభిమానులతో కలిసి ఈ సినిమా చూశారు.

Leo Director Lokesh Kanagaraj Injured Kerala Tour , Leo Movie, Lokesh Kanagaraj,

ఇలా ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినటువంటి విజయ్ సినిమా పూర్తి అయిన తర్వాత బయటకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టారు అయితే ఊహించని దానికన్నా అభిమానులు అధికంగా రావడంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది.ఇలా భారీ స్థాయిలో అభిమానులు గుంపుగా చేరడంతో లోకేష్ గాయాలు పాలయ్యారని తెలుస్తుంది.దీంతో ఈయన త్వరలో మరోసారి మీ ముందుకు వస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లారని తెలుస్తోంది.

ఇక ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ తెలియజేశారు.గాయాలు తగిలిన పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని ఈయనకు స్వల్ప గాయాలు తగిలాయని తెలుస్తుంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు