ఇకనుంచి కీబోర్డు లేని ల్యాప్‌టాప్‌

మనం ఈ రోజు వరకు కీ బోర్డు లేని స్మార్ట్ ఫోన్స్ మాత్రమే చూసాం కానీ త్వరలో కీ బోర్డులేని ల్యాప్‌టాప్‌ రానున్నాయి.

పాత ల్యాప్‌టాప్‌ ల స్థానంలో ఇప్పుడు హైబ్రిడ్‌ ల్యాప్‌టాప్స్‌, డాక్‌ఇన్‌ లాప్‌టాప్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఐతే లెనోవా సంస్థ మరో కొత్త రకం ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది.బెర్లిన్‌లో జరుగుతున్న ‘ఐఎఫ్‌ఏ 2016’లో తన తాజా పాకెట్‌ సైజ్‌ యోగా లాప్‌టాప్‌ను విడుదల చేసింది.

ఈ ల్యాప్‌టాప్‌కు 10.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ ఉంది.కేవలం 4.55 మి.మీ మందంతో 690 గ్రాముల బరువు ఉంది.దీనిలో కీబోర్డు బదులు హాలో కీబోర్డును ఉపయోగించారు.

Lenovo Announces A New Keyboard-Less Laptop-Lenovo Announces A New Keyboard-Less

దీంతో కీబోర్డు బటన్స్‌ పైకి కనిపించవు.అవసరమైప్పుడు మాత్రమే కీబోర్డులా వాడుకోవచ్చు.ఓ నల్లని బోర్డులా ఉండే దీనిపై స్టైలస్‌ పెన్‌ ద్వారా లెనోవా యాప్స్‌ సహాయంతో బొమ్మలు గీయడం, నోట్స్‌ రాసుకోవడం వంటివి చేయొచ్చు.360 డిగ్రీల్లో ఈ ల్యాప్‌టాప్‌ను ఎలాకావాలంటే అలా మడుచుకునే వీలుంది.ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, నోట్‌బుక్‌ ఇలా కావాల్సిన విధంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

బిజీ రోడ్డుపై రాంగ్ రూట్‌లో పిల్లాడు బైక్ రైడింగ్.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!
Advertisement
Lenovo Announces A New Keyboard-less Laptop

తాజా వార్తలు