వచ్చే జన్మలో పెళ్లి చేసుకుందామన్న నెటిజన్.. లావణ్య త్రిపాఠి రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) గురించి మనందరికీ తెలిసిందే.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని( Varun Tej ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు.

ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది.

అందుకు గల కారణం ఇటీవల లావణ్య త్రిపాఠి మెట్లపై నుంచి కాస్త స్లిప్ అయి పడడమే.దాంతో ఆమె కాలు బెణికింది.అయితే ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంకా ఆ నొప్పి తగ్గడం లేదని స్కానింగ్ చేయిస్తే యాంకిల్ ప్రాక్ఛర్( Ankle Fracture ) అయిందని వచ్చిందట.

Advertisement

దీంతో ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటోందట లావణ్య త్రిపాఠి.ఇలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఖాళీగా ఉన్న లావణ్య ఇప్పుడు ఇన్ స్టాలో సందడి చేయడం ప్రారంభించింది.

ఎలాగూ ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఇలా ఫ్యాన్స్‌ తో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసినట్టుగా కనిపిస్తోంది.

తాజాగా లావణ్య మొదలు పెట్టిన చిట్ చాట్ సెషన్‌లో ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలను సంధిస్తున్నారు.మీ లెగ్‌కి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ ఆరాలు తీయసాగారు.తనకు బాగానే ఉందని, కాస్త బెణికిందని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది.

అనంతరం మరో నెటిజన్ మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే.పవర్ అని రిప్లై ఇచ్చింది.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నిహారిక( Niharika ) గురించి ఒక్క పదంలో చెప్పండని అడిగితే బెస్టీ అని రిప్లై ఇచ్చింది.ఇలా సరదాగా సాగుతుండగా ఇంతలో ఒక నెటిజన్ వింతగా ప్రపోజ్ చేశాడు.

Advertisement

ఈ జన్మలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.కానీ కుదర్లేదు.

వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగగా.లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.

హిందూ మత విశ్వాసం ప్రకారం.పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.

పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు అని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది.లావణ్య తెలివిగా ఆన్సర్ ఇవ్వడంతో అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు.

తాజా వార్తలు